3
ఆమె అంటుంది
రాత్రి నా పక్క మీద,
నేను ప్రే మించిన వానికోసం చూస్తాను.
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
ఇప్పుడు మేల్కొంటాను!
నగరమంతా తిరుగుతాను.
వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ
నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను.
 
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు.
వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?”
 
కావలివాళ్లను దాటిన వెంటనే
నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను!
అతణ్ణి పట్టుకున్నాను.
అతణ్ణి పోనివ్వలేదు,
నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని పోయేవరకూ
నన్ను కన్న తల్లి గదికి తీసుకొని పోయేవరకూ.
ఆమె స్త్రీలతో అంటుంది
యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్లమీదా ఒట్టు పెట్టి, నేను సిద్ధపడేవరకూ.
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
అతను-అతని పెండ్లి కూతురు
పెద్ద జనం గుంపుతో
ఎడారినుండి వస్తున్న* ఎడారినుండి వస్తున్న చూడండి 8:5. ఈ స్త్రీ ఎవరు?
కాలుతున్న గోపరసం, సాంబ్రాణి గోపరసం, సాంబ్రాణి కాల్చినప్పుడు తియ్యగా గుబాళించే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు. ఇతర సుగంధ ద్రవ్యాల సుగంధ ద్రవ్యాలు శబ్ధార్థ ప్రకారం, “వర్తకుడి చూర్ణాలు” “విదేశాలనుండి దిగుమతి చేసుకోవసిన సుగంధ ద్రవ్యాలు, ధూపాలు.” నుండి
పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
 
చూడు, సొలొమోను ప్రయాణపు కుర్చీ!§ ప్రయాణపు కుర్చీ ధనికులు కూర్చుని ప్రయాణం చేసే ఒకరకమైన కుర్చీ. ఈ కుర్చీలు పైన కప్పబడి వుంటాయి. వీటికి పొడుగాటి కర్ర లు దూర్చి, వాటిని బానిసలు మోస్తూ ఉంటారు.
అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు.
బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు,
వారి పక్కనున్న కత్తులు,
ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు కుర్చీ చేయించాడు,
దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
10 దాని కాళ్లు వెండితో చేయబడ్డాయి,
ఆధారాలు బంగారంతో చేయబడ్డాయి,
కూర్చొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది.
యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
 
11 సీయోను స్త్రీలారా, బయటకు రండి
రాజు సొలొమోనును చూడండి
అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున
అతని తల్లి పెట్టిన కిరీటాన్ని* కిరీట ము ఇది బహుశః అతని పెండ్లి సమయంలో తల మీద ధరించిన పూలదండ కావచ్చును. చూడండి!

*3:6: ఎడారినుండి వస్తున్న చూడండి 8:5.

3:6: గోపరసం, సాంబ్రాణి కాల్చినప్పుడు తియ్యగా గుబాళించే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు.

3:6: సుగంధ ద్రవ్యాలు శబ్ధార్థ ప్రకారం, “వర్తకుడి చూర్ణాలు” “విదేశాలనుండి దిగుమతి చేసుకోవసిన సుగంధ ద్రవ్యాలు, ధూపాలు.”

§3:7: ప్రయాణపు కుర్చీ ధనికులు కూర్చుని ప్రయాణం చేసే ఒకరకమైన కుర్చీ. ఈ కుర్చీలు పైన కప్పబడి వుంటాయి. వీటికి పొడుగాటి కర్ర లు దూర్చి, వాటిని బానిసలు మోస్తూ ఉంటారు.

*3:11: కిరీట ము ఇది బహుశః అతని పెండ్లి సమయంలో తల మీద ధరించిన పూలదండ కావచ్చును.